మన పూర్వీకులు భోగీ పండగను ఎట్లా మొదలు పెట్టారు? సంక్రాంతి పండుగ సందర్భం ఏమిటి? కనుమ అని మూడవ రోజు పండగ ఎందుకు? ఈ ప్రశ్నల వెనుక ఏదైనా సైన్స్ ఉందా? లేదా కొంచెం కామన్ సెన్స్ తో అప్పుడు ఈ పండగలు చేసేవారా? సంక్రాంతి పండుగ వెనుక ఐతే, ఆస్ట్రానమీ ఉంది. ఈ రోజున సూర్యుడు ఉత్తరాయణం లోకి అడుగు పెడతాడు. ఉత్తర ఆయనం అంటే ఉత్తరం వైపుకి పయనించడం అని అర్ధం. సూర్యుడు కొంత కాలం భూమధ్యరేఖకి దక్షిణం వైపు పయనించడం, తరువాత దక్షిణం వైపు నించి ఉత్తరం వైపుకి పయనించడం జరుగుతూ ఉంటుంది. సూర్యుడు పయనించే దిక్కుని బట్టి దక్షిణం వైపుకి పయనిస్తున్నపుడు దక్షిణాయనం అని ఉత్తరం వైపుకి పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు. సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తుంటాయి. సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒక వైపు అనగా దక్షిణం వైపు, మరో ఆరు నెలలు ఒక వైపు అనగా ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు. సూర్యుని పయనాన్ని బట్టి మనకు సీజన్స్ మారుతుంటాయి. భోగీ మంట ఎందుకు వేస్తున్నారు? దీనికి కూడా ఆస్ట్రానమీ నే కారణం. ఉత్తరాయంలో కి వచ్చే ముందు రోజు, దక్షిణాయనం చివరి రోజు చలి ఎక్కువ ఉంటుంది. దాన...
Thoughts and Experiences